ఇంగ్లిష్ భాషలో పదాలతో ఆడుకొవడానికి ఒక మంచి ఆట ఇది. ఆటతో పాటుగా కొత్త పదాలను నేర్చుకొవడం సులువు. ఆ భాషలో దీనిని "స్క్రా బిల్" అని పలుకుతారు. ఇద్దరు లేదా నలుగురు ఈ ఆటని ఆడవచ్చు. నిలువుగాకాని, అడ్డంగాకాని ఒక వరుసక్రమంలో, అక్షరాలను పేర్చి అర్ధవంతమైన కొత్త పదాలను కూర్చడమే ఈ ఆట ఉద్దేశ్యం. అందుకనే ఈ ఆట నేడు సుమారుగా 120 దేశాలలో, 29 భాషలలో ప్రాచుర్యంపొందింది.
డచ్ భాషలోని పదం - 'schrabbelen' నుండి ఇంగ్లిష్ లోకి ఇది వచ్చిచేరింది. ఆ భాషలో దానికి 'గీకడం' లేదా "బరకడం" అని అర్ధం . గోళ్ళతో గీకడం, పెచ్చులు గీకడం, నెమ్మదిగా పొరల పొరలను గీకి తీసేయ్యడం ఈ పదానికి ఆ భాషలో అర్ధం.
అలాగే ఎంతో కొంత శ్రమ, ప్రయాస, కొంత పోరాటంతొ (to struggle, scramble) ఏదేని సాధించడం అని కూడా చెప్పుకొవచ్చు. ఈ అర్ధంతో ఈ పదం 1635 ప్రాంతాలలో వాడుకలోకి వచ్చిందని ఒక అంచనా.
1950 ప్రాంతాలలొ ప్రస్తుతం ప్రాచుర్యంలో వున్న ఈ పేరు "స్క్రా బిల్" తో ఈ ఆట బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ఆట కొన్ని ప్రాంతాలలో Alfapet, Funworder, Skip-A-Cross and Palabras Cruzadas అన్న పేరులతో కూడా బహుళ జనాదరణ పొందుతు వ్యాపిస్తున్నది. ఈలాంటి ఆట మన తెలుగు భాషలో ఉంటే మనం కూడా చక్కగా ఆడుకుంటూమనకు తెలియని ఎన్నొ కొత్త పదాలను నేర్చుకోగలుగుతాము, కదా?
Wednesday, June 27, 2007
స్క్రా బిల్ (Scrabble) Etymology
Posted by Anil Atluri at 12:17 AM ((•)) Hear this post
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment