Tuesday, July 31, 2007

Sunday, July 15, 2007

ఇంకెవరికేనా తెలుసా యీ పద్యం?

Lalita said...

From an old riddle semi-remembered, రాముడే రీతి రావణు వధియించె? లకోలకోల. The riddle goes on with answers all being palindromes. తోకమూకతో, మందారదామం, వగైరా వగైరా. సీసపద్యం, తేటగీతి. ఇంకెవరికేనా తెలుసా యీ పద్యం? I've forgotten most of it.

తెలుగులో "పాలిండ్రోం" అనే "ఇ పదం" (ఇంగ్లిష్ పదం) పోస్ట్‌కి లలితగారి జవాబు ఇది?

మీకేవరికైనా తెలిస్తే చెప్పరూ..

Saturday, July 14, 2007

తెలుగులో PALINDROME

A palindrome is a word or phrase that is spelled the same way forwards or backwards.
ఇది పాలిండ్రొం కి ఇంగ్లిష్‌లొ నిర్వచనం.
ఉదాహరణకి, రెండు పదాలు; AMMA, MALAYALAM.
ఒక పాలిండ్రొం phrase: 'Madam, I'm Adam'.

తెలుగులో పాలిండ్రొం ని ఏమని పిలుస్తారు?





"కిటికి",







"వికటకవి" కాకుండా ఇంకేవన్నా పదాలు చెప్పండి...

Saturday, July 07, 2007

వీటి్‌కి అనగ్రాంలు...



SUNITA WILLIAMS
= ?



TAJ MAHAL = ?



NARKETPALLI = ?

* ఒక పదంలొ" కనీసం నాలుగు అక్షరాలు ఉంటే బాగుంటుంది.
:)

Wednesday, July 04, 2007

అర్జెంట్. వెంటనే కావాలి, ఈ అనగ్రాం

అర్జెంట్. వెంటనే కావాలి, ఈ అనగ్రాం


T E L A N G A N A = ?



* వీవెన్ గారికి,
లలితగారికి,
మీ
అనగ్రాంస్ కి, థాంక్స్!

Tuesday, July 03, 2007

టంగ్ ట్విస్టర్స్

గబ గబ చదవండి.

నీ నాన్న నా నాన్న అని నేనన్ననా? నా నాన్న నీ నాన్న అని అన్నానా? నీ నాన్న నీ నాన్నే. నా నాన్న నా నాన్నే అని నేనన్నాను.

ఇలాంట తెలుగు టంగ్ ట్విస్టర్స్ మీకు తెలిసినవి టపా చెయ్యండి.
పదిమందితో పంచుకోవచ్చు.


ఇందులో తప్పులెన్నండి.
చేబితే దిద్దుకుంటాను.

Saturday, June 30, 2007

తెలుగు అనగ్రాం.

మీరు చెప్పండి!


ఈసారి ఇంకో ఊరు. మరో కొత్త పేరు.

MACHILIPATNAM = ?

Friday, June 29, 2007

తెలుగు అనగ్రాం. మీరు చెప్పండి..

ఏదేని కొన్ని అక్షరాలను ఒక వరుసక్రమంలో కూర్చితే ఏర్పడే అర్ధవంతమైన పదాన్ని ఇంగ్లిష్ భాషలో అనగ్రాం అని అంటారు.

చిన్న ఉదాహరణ ; William Shakespeare = I'll make a wise phrase.
మరొకటి ;
William Butler Yeates = Wait, I'm really subtle.
ఇవి English పేర్లు.
మరి మన తెలుగు పేర్లు ఐతే ఎలా వుంటయి?
మచ్చుకి ఒకటి VIJAYAWADA = ?

తొందరగా టపా పంపండి. ఇంకా ఆలోచిస్తున్నారా?

Wednesday, June 27, 2007

తెలుగు అక్షరాలు కనపడటం లేదా?

e-పదం ( ePadam) బ్లాగులో తెలుగు అక్షరాలు మీకు కనపడటం లేదా?
Unable to see Telugu letters ?
Click here.

మీ కంప్యూటర్లో తెలుగు అక్షరాలు కనపడటానికి ఏమి చెయ్యాలో ఇక్కడ చూడండి.

ఒక వేళ మీ కంప్యూటర్లో Windows 98 ఉన్నట్టయితే
ఏమి చెయ్యాలో ఇక్కడ చూడండి.
చక్కగా తెలుగులో రాసుకొవచ్చు, చదువుకోవచ్చు కూడా.

స్క్రా బిల్ (Scrabble) Etymology



ఇంగ్లిష్ భాషలో పదాలతో ఆడుకొవడానికి ఒక మంచి ఆట ఇది. ఆటతో పాటుగా కొత్త పదాలను నేర్చుకొవడం సులువు. ఆ భాషలో దీనిని "స్క్రా బిల్" అని పలుకుతారు. ఇద్దరు లేదా నలుగురు ఈ ఆటని ఆడవచ్చు. నిలువుగాకాని, అడ్డంగాకాని ఒక వరుసక్రమంలో, అక్షరాలను పేర్చి అర్ధవంతమైన కొత్త పదాలను కూర్చడమే ఈ ఆట ఉద్దేశ్యం. అందుకనే ఈ ఆట నేడు సుమారుగా 120 దేశాలలో, 29 భాషలలో ప్రాచుర్యంపొందింది.

డచ్ భాషలోని పదం - 'schrabbelen' నుండి ఇంగ్లిష్ లోకి ఇది వచ్చిచేరింది. ఆ భాషలో దానికి 'గీకడం' లేదా "బరకడం" అని అర్ధం . గోళ్ళతో గీకడం, పెచ్చులు గీకడం, నెమ్మదిగా పొరల పొరలను గీకి తీసేయ్యడం ఈ పదానికి ఆ భాషలో అర్ధం.

అలాగే ఎంతో కొంత శ్రమ, ప్రయాస, కొంత పోరాటంతొ (to struggle, scramble) ఏదేని సాధించడం అని కూడా చెప్పుకొవచ్చు. ఈ అర్ధంతో ఈ పదం 1635 ప్రాంతాలలో వాడుకలోకి వచ్చిందని ఒక అంచనా.

1950 ప్రాంతాలలొ ప్రస్తుతం ప్రాచుర్యంలో వున్న ఈ పేరు "స్క్రా బిల్" తో ఈ ఆట బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ఆట కొన్ని ప్రాంతాలలో Alfapet, Funworder, Skip-A-Cross and Palabras Cruzadas అన్న పేరులతో కూడా బహుళ జనాదరణ పొందుతు వ్యాపిస్తున్నది. ఈలాంటి ఆట మన తెలుగు భాషలో ఉంటే మనం కూడా చక్కగా ఆడుకుంటూమనకు తెలియని ఎన్నొ కొత్త పదాలను నేర్చుకోగలుగుతాము, కదా?